హిందీ ‘జెర్సీ’ : షాహిద్ ప్రీ-లుక్
షాహిద్ కపూర్ ‘జెర్సీ’ రీమేక్ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రీ-లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. 2020 ఆగస్టు 28న విడుదల చేయనున్నారు..

షాహిద్ కపూర్ ‘జెర్సీ’ రీమేక్ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రీ-లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. 2020 ఆగస్టు 28న విడుదల చేయనున్నారు..
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీని అల్లు అరవింద్ – దిల్ రాజుతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ సంయుక్తంగా నిర్మించనున్నారు..
ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నాడు. షాహిద్ ‘జెర్సీ’ రీమేక్ కోసం రెడీ అవుతున్నాడు. క్యారెక్టర్ కోసం సీరియస్‌గా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
Read Also : నిశ్శబ్దం : అంజలి లుక్ అదిరింది
షాహిద్ బ్యాట్ పట్టుకుని ఉన్న పిక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. ‘జెర్సీ రీమేక్ కోసం షాహిద్ సిద్ధమవుతున్నాడు.. ఇదే ప్రీ లుక్.. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది.. 2020 ఆగస్టు 28న విడుదల చేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు.
Shahid Kapoor begins prep for the role of a cricketer in the #Hindi remake of #Telugu film #Jersey… The #Hindi version will be directed by Gowtam Tinnanuri, who also helmed the original #Telugu version, starring Nani… 28 Aug 2020 release. pic.twitter.com/9TUcNTOWvf
— taran adarsh (@taran_adarsh) November 1, 2019