Vikram: బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేయనున్న విక్రమ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ సినిమాలో కమల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను సాధించింది. సౌత్ కొరియాలో జరగనున్న బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 27వ ఎడిషన్‌లో విక్రమ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.

Kamal Haasan Vikram To Be Screened At Busan International Film Festival
Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ సినిమాలో కమల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇక ఈ సినిమా కమర్షియల్‌గా కూడా భారీ విజయాన్ని అందుకుంది.
Vikram: సెంచరీ కొట్టిన విక్రమ్.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!
అయితే ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. కాగా క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. చాలా రోజుల తరువాత కమల్‌కు అదిరిపోయే సక్సెస్ విక్రమ్ మూవీ రూపంలో వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను సాధించింది. సౌత్ కొరియాలో జరగనున్న బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 27వ ఎడిషన్‌లో విక్రమ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.
Vikram : కమల్‌కి, టామ్ క్రూజ్‌కి ఉన్న కామన్ పాయింట్ తెలుసా?? ఇద్దరూ ఇద్దరే..
అక్టోబర్ 5-14 వరకు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 7 మరియు అక్టోబర్ 8న విక్రమ్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇది నిజంగా విక్రమ్ చిత్ర యూనిట్ మరియు అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. కమల్ హాసన్ నటించిన ఈ సినిమాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేస్తుండటంతో విక్రమ్ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా, ఓటీటీలోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.