Puneeth Rajkumar: పునీత్‌ పార్థివ దేహానికి ముద్దు పెట్టిన ముఖ్యమంత్రి.. కుటుంబానికి అండగా.. అన్నీ తానై..!!

నువ్వేంటో తెలియాలంటే, నీ మరణమే చెబుతుంది.. పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత తానేంటో ప్రపంచం చూస్తుంది.

Puneeth Rajkumar: పునీత్‌ పార్థివ దేహానికి ముద్దు పెట్టిన ముఖ్యమంత్రి.. కుటుంబానికి అండగా.. అన్నీ తానై..!!

Punith Bommai

Updated On : October 31, 2021 / 9:07 AM IST

Puneeth Rajkumar: నువ్వేంటో తెలియాలంటే, నీ మరణమే చెబుతుంది.. పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత తానేంటో ప్రపంచం చూస్తుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది పునీత్‌కు నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాక్షాత్తు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పునీత్ పార్థివ దేహానికి ముద్దుపెట్టి కన్నీరు పెట్టుకున్నారు.

పునీత్ రాజ్‌కుమార్ చనిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రివ్యూలు చేస్తూనే.. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో ఉంటూ అన్నీ తానై అండగా నిలబడ్డారు. అమెరికాలో ఉన్న పునీత్ కుమార్తె ధృతిని తీసుకురావడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బొమ్మై విదేశాంగ శాఖ అధికారులతో కూడా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ప్రత్యేక విమానంలో తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

రాజ్‌కుమార్ – పార్వతమ్మ రాజ్‌కుమార్ సమాధి పక్కనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేవరకు పునీత్.. కుటుంబ సభ్యులతోనే ఉంటూ.. బొమ్మై అన్నీ తానై బాధ్యతలు కుటుంబానికి అండగా ఉన్నారు. తమ అభిమాన నటుడిని చివరిగా చూడాలని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు, ప్రముఖుల విషయంలో పోలీసు భద్రతపై ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నారు. పునీత్ అంత్యక్రియలు జరిగేవరకు కూడా బొమ్మై జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు.