Kota Srinivasa Rao : మరణించిన 11 రోజులకు కోట శ్రీనివాసరావు చివరి సినిమా.. ఏ పాత్ర వేశారో తెలుసా?
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల జులై 13న మరణించిన సంగతి తెలిసిందే.

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల జులై 13న మరణించిన సంగతి తెలిసిందే. వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే కోట శ్రీనివాసరావు మరణించిన 11 రోజులకు ఆయన చివరి సినిమా రిలీజ్ అయింది.
కోట శ్రీనివాసరావు గత కొన్నాళ్లుగా వయోభారంతో సినిమాలకు దూరంగానే ఉన్నారు. కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అడపాదడపా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో నటించారు. ఇదే ఆయన చివరి సినిమాగా నిలిచింది.
Also Read : Fahadh Faasil : పుష్ప విలన్ రిటైర్మెంట్ ప్లాన్ వింటే మైండ్ పోతుంది.. స్టార్ నటుడు ఆ పని చేస్తాడట..
హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజయింది. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు కొల్లూరు సంస్థాన రాజుగా నటించారు. తెరపై దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ తో కాంబో సీన్ కూడా ఉంది. దీంతో చివరిసారి కోట శ్రీనివాసరావును తెరపై చూసి ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు మరోసారి ఆయన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతున్నారు.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చింది?