Kota Srinivasa Rao : నేను బ్రతికే ఉన్నాను.. సోషల్ మీడియాలో మరణవార్త పై కోటశ్రీనివాస రావు రియాక్షన్..

సోషల్ మీడియాని కొంతమంది మంచికి ఉపయోగిస్తుంటే, మరికొంత మంది మాత్రం నిరుపయోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోటశ్రీనివాస రావు చనిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి. దీని పై కోటశ్రీనివాస రావు స్పందిస్తూ..

Kota Srinivasa Rao : నేను బ్రతికే ఉన్నాను.. సోషల్ మీడియాలో మరణవార్త పై కోటశ్రీనివాస రావు రియాక్షన్..

Kota Srinivasa Rao reaction on his health news in social media

Updated On : March 21, 2023 / 12:19 PM IST

Kota Srinivasa Rao : సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలా విషయాలు తెలియక అయ్యాయి. టాలెంట్ ని ప్రదర్శించడానికి అయినా, టాలెంట్ ని వెతకడానికి అయినా సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అయ్యింది. దానిని కొంతమంది మంచికి ఉపయోగిస్తుంటే, మరికొంత మంది మాత్రం నిరుపయోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్లు పై అసత్య ప్రచారం చేయడం, దూషించడం, అలాగే అనారోగ్యంతో బాధ పడుతున్న వారి గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు.

Kota Srinivasa Rao : కొత్త సినిమాలో కోట లుక్.. ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా..

ఇక సీనియర్ నటులు విషయంలో అయితే మరి శృతిమించి చనిపోయారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు ఈ సమస్యని ఎదురుకున్నారు. తాజాగా సీనియర్ నటుడు కోటశ్రీనివాస రావు (Kota Srinivasa Rao) కూడా ఈ సమస్యను ఎదురుకున్నారు. దీని పై కోటశ్రీనివాస రావు స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాలో నేను చనిపోయాను అంటూ ప్రచారం చేస్తున్నారు అంటా. అది చూసి ఉదయం నుంచి నాకు 50 కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అన్నిటికి కంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 10 మంది పోలీసులు ఆ వార్త చూసి ఇంటికి వచ్చారు.

Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!

కోటశ్రీనివాస రావు గారు చనిపోయారు అంటే ప్రముఖులు వస్తారని సెక్యూరిటీ ఇద్దామని వచ్చినట్లు తెలియజేశారు. తెల్లవారితే ఉగాది పండుగా ఉన్న టైంలో ఈ వార్త చాలా బాధ పెట్టింది. డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ ఇలా ఒక మనిషి ప్రాణంతో సంపాదించడం సరి కాదు. ఇలాంటి విషయాలు పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇలాంటివి నమ్మ వద్దని నేను మనవి చేసుకుంటున్నా. నేను బ్రతికే ఉన్నాను, అందరికి ఉగాది శుభాకాంక్షలు” అంటూ తెలియజేశారు.