మాస్ మహేష్ బాబు మండేస్.. వారానికో పాట.. గెట్ రెడీ గయ్స్
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఒక్కో పాటను డిసెంబర్ నెలలో ఒక్కో సోమవారం రిలీజ్ చేయనున్నారు..

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఒక్కో పాటను డిసెంబర్ నెలలో ఒక్కో సోమవారం రిలీజ్ చేయనున్నారు..
సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ‘‘సరిలేరు నీకెవ్వరు’’ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు.
‘మాస్ ఎమ్‌బి మండేస్ దిస్ డిసెంబర్ 5 మండేస్ 5 సాంగ్స్ గెట్ రెడీ గయ్స్’ అంటూ డిసెంబర్ నెలలో ఉన్న అయిదు సోమవారాలలో వారానికి ఒక పాట చొప్పున రిలీజ్ చేయనున్నామని తెలిపారు. రాక్ స్టార్ డీఎస్పీ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చుంటాడని మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం మెయిన్ థియేటర్ వద్ద 81 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం. మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.