Liger Ticket Prices To Get Hike: ‘లైగర్’తో మళ్లీ వాయింపుడేనా..?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆగస్టు 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రాన్ని ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూసేందుకు చాలా మంది ఆతృతగా ఉన్నారు. అయితే లైగర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు థియేటర్ యాజమాన్యాలు ఓ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Liger Ticket Prices To Get Hike In Nizam
Liger Ticket Prices To Get Hike: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, విజయ్ ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమా సక్సెస్‌పై రౌడీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ధీమాగా ఉన్నారు. కాగా, ఆగస్టు 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రాన్ని ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూసేందుకు చాలా మంది ఆతృతగా ఉన్నారు.
Liger Pre Release Event : లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అయితే లైగర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు థియేటర్ యాజమాన్యాలు ఓ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో లైగర్ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. సింగిల్ స్క్రీన్‌కు రూ.175, మల్టీప్లెక్స్‌కు రూ.250 టికెట్ రేట్లుగా ఫిక్స్ చేశారు. ఇటీవల కాలంలో నైజాం ఏరియాలో ఈ రేంజ్‌లో టికేట్ రేట్లు పెరగలేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
I Support Liger: ట్విట్టర్‌కు చుక్కలు చూపిస్తున్న లైగర్.. బాయ్‌కాట్ భరతం పట్టిన రౌడీ ఫ్యాన్స్!
అటు ఏపీలో టికెట్ రేట్లు సాధారణంగానే కొనసాగనున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్‌కు రూ.147, మల్టీప్లెక్స్‌కు రూ.177 టికెట్ రేట్లుగా ఉండబోతున్నాయి. మరి ఈ టికెట్ రేట్ల వాయింపుడుపై అభిమానులు ఏమంటారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా లైగర్ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.