మహేష్ ప్రాబ్లం ఏంటంటే: మహర్షి టీజర్ చూశారా?
మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ‘మే’లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన తొలి టీజర్ ఇప్పటికే విడుదలవగా.. ఉగాది సందర్భంగా ఇవాళ(6 ఏప్రిల్ 2019) రెండో టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Read Also : నేడు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ విరామం
ఈ సినిమాలో రఫ్ లుక్‌తో మహేష్ చాలా స్టైలీష్‌గా ఉన్నారు. ఈ సినిమా రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ ఆధారిత దేశం అయిన మనదేశంలో పరిస్దితులు బాగోక, ప్రభుత్వాలు సహకరించక, వ్యవసాయం దండగ అనే అభిప్రాయానికి జనం వచ్చేస్తున్నారు. పంట పొలాలను అమ్మేసుకోని రైతులు సిటీలకు వలసలు పోతున్నారు. మరికొంతమంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి విషయాన్నే ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది. కమర్షియల్ హంగులతో శ్రీమంతుడు వంటి గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో సినిమా తీసిన మహేష్.. ఆధునిక పద్దతులతో చేస్తే వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా చూపబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా విడుదలైన టీజర్‌లో నాకొక ప్రాబ్లం ఉంది సార్..‘ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Read Also : గర్ల్ ఫ్రెండ్‌కి థ్యాంక్స్: సివిల్స్ టాపర్