Sarkaru Vaari Paata: పరుశురామ్‌కు మహేష్ 45 రోజుల టార్గెట్..!

మహేష్ సర్కారు వారి పాటతో మరోసారి తన మార్క్ మేనరిజంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ లో కనిపించే కామెడీతో కూడిన యాక్షన్ ను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. గత సినిమాలు ఇదే రుజువు చేశాయి. సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకున్న దర్శకుడు పరుశురామ్ తాను చెప్పాలనుకున్న కథను మహేష్ మార్క్ జత చేసి తెరకెక్కిస్తున్నాడు.

Sarkaru Vaari Paata: పరుశురామ్‌కు మహేష్ 45 రోజుల టార్గెట్..!

Sarkaru Vaari Paata

Updated On : August 14, 2021 / 10:47 AM IST

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాటతో మరోసారి తన మార్క్ మేనరిజంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ లో కనిపించే కామెడీతో కూడిన యాక్షన్ ను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. గత సినిమాలు ఇదే రుజువు చేశాయి. సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకున్న దర్శకుడు పరుశురామ్ తాను చెప్పాలనుకున్న కథను మహేష్ మార్క్ జత చేసి తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మధ్యనే విడుదల చేసిన సర్కారు వారి పాట టీజర్‌ భారీ హైప్ క్రియేట్ చేసింది.

సర్కారు వారి టీజర్ విడుదలైన కాసేపటికే రికార్డ్ వ్యూస్‌తో సినిమా హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో కీర్తి సురేష్, మహేష్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడగా.. ఓ శక్తివంతమైన కథను పరుశురామ్ సరదాగా సాగిపోయే సినిమాగా మలచినట్లు అర్ధమైంది. ఇక థమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ కానుందని టీజర్ ద్వారా అంచనాలు మొదలయ్యాయి. కాగా, ప్రస్తుతం ఈ సినిమా గోవాలో షూటింగ్‌లో బిజీగా ఉంది. గోవాలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే.. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ ఇచ్చిన డేట్స్ మించిపోయింది. కానీ, సినిమా ఇంకా పూర్తి కాలేదు. కానీ మహేష్ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టనున్నాడు. దీనికోసమే సర్కారు వారి పాటను సాధ్యమైనంత త్వరగా ముగించాలని చూస్తున్నారట. దీని కోసం మహేష్ దర్శకుడు పరుశురామ్ కు 45 రోజుల టార్గెట్ ఇచ్చినట్లు ఇన్ సైడ్ టాక్ ఒకటి నడుస్తుంది. మహేష్ ఇచ్చిన టార్గెట్ లోపు సర్కారు వారి పాట పనులను వేగంగా ముగించాలని దర్శక, నిర్మాతలు ఇప్పుడు వేగంగా పనులు చేపట్టినట్లు తెలుస్తుంది.