మహర్షి సెట్‌లో మహేష్
మహర్షి సెట్‌లోనుండి బయటకొచ్చిన మహేష్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మహర్షి సెట్‌లోనుండి బయటకొచ్చిన మహేష్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు. ఫస్ట్‌టైమ్ పూజాహెగ్డే మహేష్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సూపర్ స్టార్ ఫస్ట్ అండ్ సెకండ్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా మహర్షి సెట్‌లోనుండి మహేష్ పిక్ ఒకటి బయటకొచ్చి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పచ్చటి పొలాల మధ్య, చుట్టూ జూనియర్ ఆర్టిస్ట్‌లుండగా, అసిస్టెంట్ గొడుగు పట్టుకుని ఉంటే, మహేష్ అలా నడుచుకుంటూ వస్తున్నాడు ఆ పిక్‌లో.
ఫార్మల్ వేర్‌లో, టక్ చేసుకుని, గాగుల్స్‌తో ఉన్న మహేష్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో మహేష్, స్టూడెంట్‌గా, రైతుగా, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. జగపతి బాబు, జయసుధ, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్న మహర్షిమూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2019 ఏప్రిల్ 25న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.