Mammootty: ఏజెంట్ కోసం మమ్ముట్టి మరోసారి ఆ ఫీట్ చేస్తున్నాడుగా..!

అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని తన పాత్రకు మమ్ముట్టి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడట.

Mammootty: ఏజెంట్ కోసం మమ్ముట్టి మరోసారి ఆ ఫీట్ చేస్తున్నాడుగా..!

Mammootty Dubs For His Role In Agent Movie

Updated On : April 26, 2023 / 1:25 PM IST

Mammootty: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా, పూర్తి స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తుండగా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Mammootty: “మమ్ముట్టి”తో కలిసి నటించడం.. తన జీవిత లక్ష్యం అంటున్న స్టార్ హీరో..

ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. కాగా, ఈ సినిమా కోసం మమ్ముట్టి ఓ రేర్ ఫీట్‌ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోలకు డబ్బింగ్ వేరేవారు ఇస్తుంటారు. అయితే, గతంలో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ సినిమాకు ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమా కోసం మరోసారి ఆయన తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర నచ్చడంతో ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆసక్తిని చూపినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.

Mammootty : మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి కరోనా

సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోన్న ఏజెంట్ మూవీలో బాలీవుడ్ నటుడు డినో మోరియా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.