Chiranjeevi : ఎన్టీఆర్ గారు చెప్పడం వల్లే.. అవి నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి.. చిరంజీవి వ్యాఖ్యలు

చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఓ సంఘటనని, ఆయన ఇచ్చిన ఓ సలహాని గుర్తుచేసుకున్నారు.

Chiranjeevi : ఎన్టీఆర్ గారు చెప్పడం వల్లే.. అవి నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి.. చిరంజీవి వ్యాఖ్యలు

Megastar Chiranjeevi shares about Sr NTR Interesting Advice in his Career Beginning

Updated On : January 20, 2024 / 4:44 PM IST

Megastar Chiranjeevi : విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్(NTR) పుణ్య తిథి, ఏఎన్ఆర్(ANR) శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ తో జరిగిన ఓ సంఘటనని, ఆయన ఇచ్చిన ఓ సలహాని గుర్తుచేసుకున్నారు.

Also Read : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా కన్ఫర్మ్.. సలార్ తర్వాత ప్రభాస్ లైనప్ ఇదే..

చిరంజీవి మాట్లాడుతూ.. నేను కెరీర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్నాను. ఒక రోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లినప్పుడు రండి బ్రదర్ కూర్చోండి అన్నారు. భయం భయంగా కూర్చున్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మీరు సంపాదించిన డబ్బు అంతా ఇనుప ముక్కలు మీద పెట్టొద్దు, ఏదైనా మంచి ఇల్లు కట్టుకోండి, స్థలాల మీద పెట్టుకోండి మనల్ని కాపాడేది అదే అన్నారు. మనం ఎక్కువ కాలం ఇలాగే స్టార్ డమ్ తో ఉంటామని అనుకోకండి అని ఎంతో ముందుచూపుతో చెప్పారు.

అప్పటిదాకా నేను మంచి కారు కొనుక్కుందామా, అప్పట్లో వచ్చే స్టైలిష్ టయోటా కారు కొనుక్కుందాం అనుకున్నాను. ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ కార్ కొనడం ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం మొదలుపెట్టాను ఈ రోజు నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అని చెప్పారు. దీంతో చిరంజీవి కామెంట్స్ వైరల్ గా మారాయి.