Dasara Movie: 2 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న నాని.. కెరీర్‌లో తొలిసారి!
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ ఓవర్సీస్ లో దుమ్ములేపుతోంది. ఈ సినిమాతో నాని తొలిసారి 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతున్నాడు.

Nani Dasara Movie To Enter 2 Million Dollar Club
Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో కనిపించడంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఇక ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Nani Dasara : తెలుగు ఇండియన్ ఐడల్‌లో ధరణి ధూమ్ ధామ్ సందడి..
ముఖ్యంగా ఓవర్సీస్‌లో నానికి మంచి పట్టున్న యూఎస్‌లో దసరా సినిమాకు ప్రేక్షకలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అక్కడ 1.7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రావడంతో ఈ సినిమా నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నాని కెరీర్‌లో తొలిసారి 2 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Dasara : దసరా బ్లాక్ బాస్టర్ పార్టీ.. దావత్ పెడుతున్న నాని..
ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకెళ్తుండటంతో, టోటల్ రన్‌లో ఈ మూవీ ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.