Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్‌డేట్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న...

New Update From Gopichand Pakka Commercial Movie
Gopichand: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ఇచ్చింది.
Gopichand : షూటింగ్‌లో హీరో గోపీచంద్‌కి ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..
ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ పాటను జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సెకండ్ సింగ్ సాంగ్ ‘అందాల రాశి..’ అంటూ సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను మారుతి మార్క్ కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌కు కొదువే లేకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ రాశి కన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ యాక్షన్ అంశాలను కూడా జోడించి కామన్ ఆడియెన్స్ సినిమాలో ఏం కోరుకుంటారో వాటిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈ సినిమాను జూలై 1న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Gopichand: ‘పక్కా కమర్షియల్’ బరిలోకి దిగేది అప్పుడే!
పక్కా కమర్షియల్ సినిమాలో సత్యరాజ్, రావు రమేశ్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. UV క్రియేషన్స్, GA2 పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. మరి పక్కా కమర్షియల్ సినిమా కమర్షియల్‌గా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Macho star @YoursGopichand & @DirectorMaruthi ‘s #PakkaCommercial 2nd Single will be out on ???? ???!! ❤️
A @JxBe Musical ?#AlluAravind @RaashiiKhanna_ #BunnyVas #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations @adityamusic
In theatres #PakkaCommercialOnJuly1st ✨ pic.twitter.com/FwFtfUjtyq
— UV Creations (@UV_Creations) May 26, 2022