Niharika – Pawan Kalyan : బాబాయ్ సినిమాలో ఆ పాటని చూసి.. నేను కూడా నటి అవ్వాలనుకున్నాను..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక తాను నటిగా మారాలని ఎప్పుడు అనుకుందో తెలిపింది.

Niharika – Pawan Kalyan : బాబాయ్ సినిమాలో ఆ పాటని చూసి.. నేను కూడా నటి అవ్వాలనుకున్నాను..

Niharika Interesting Comments on Pawan Kalyan Song that inspired her to become an Actor

Updated On : August 8, 2024 / 10:52 AM IST

Niharika – Pawan Kalyan : మెగా డాటర్ నిహారిక ఇప్పటికే హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లు చేసింది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా రేపు ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక తాను నటిగా మారాలని ఎప్పుడు అనుకుందో తెలిపింది.

Also Read : Rana – Miheeka : రానాతో స్పెషల్ ఫొటో షేర్ చేసిన భార్య.. నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ..

నిహారిక మాట్లాడుతూ.. కళ్యాణ్ బాబాయ్ బాలు సినిమాలోని ‘నీలో జరిగే తంతు చుస్తూనే ఉన్నా..’ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఆ పాట చూసి నేను కూడా నటి అవ్వాలని అనుకున్నాను. ఆ పాట నన్ను ఇన్‌స్పైర్ చేసింది అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అసలు ఆ పాటలో ఇన్‌స్పైర్ చేసేంత ఏముంది, నిహారిక నటి అవ్వాలనుకునేంతగా ఆ పాటలో ఏముందో, నిహారిక అందులో ఏం గమనించిందో అని కామెంట్స్ చేస్తున్నారు.