నితిన్ ‘రంగ్‌దే!’ – ప్రారంభం

నితిన్, కీర్తి సురేష్ జంటగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న‘రంగ్‌దే!’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : October 8, 2019 / 08:23 AM IST
నితిన్ ‘రంగ్‌దే!’ – ప్రారంభం

Updated On : October 8, 2019 / 8:23 AM IST

నితిన్, కీర్తి సురేష్ జంటగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న‘రంగ్‌దే!’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాంచి జోరుమీదున్నాడు.. ఒకదాని తర్వాత ఒకటి వరసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ మూవీ చేస్తున్న నితిన్, చంద్రశేఖర్ యేలేటితో చెయ్యబోయే కొత్త సినిమాకి ఇటీవలే కొబ్బరికాయ కొట్టేశాడు. దసరా సందర్భంగా నితిన్ నటించబోయే న్యూ మూవీ ‘రంగ్‌దే!’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

యాక్టర్ నుండి రైటర్ అండ్ డైరెక్టర్‌గా టర్న్ అయ్యి.. ‘తొలిప్రేమ’, ‘Mr.మజ్ను’ సినిమాలతో  గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై.. సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు.. హీరోగా నితిన్ 29వ సినిమా ఇది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Read Also : హౌస్ ఫుల్ 4 – ‘బాలా.. సైతాన్ కా సాలా’ వీడియో సాంగ్..

హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్‌నిచ్చారు. సీనియర్ నరేష్, పి.సి.శ్రీరామ్, దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించనుండగా.. ‘ఇష్క్’ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2020 సమ్మర్‌లో ‘రంగ్‌దే!’ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.