Devara : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా వచ్చేది ఆ ఓటీటీలోనే.. పండక్కి అప్డేట్ ఇచ్చిన దేవర..

ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫుల్ మాస్ యాక్షన్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా వచ్చేది ఆ ఓటీటీలోనే.. పండక్కి అప్డేట్ ఇచ్చిన దేవర..

NTR Devara Movie OTT Update by Movie Unit on Sankranthi

Updated On : January 15, 2024 / 10:19 AM IST

Devara : ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(NTR) కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు.

ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫుల్ మాస్ యాక్షన్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. సముద్రపు ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్రపు దొంగలు కథాంశంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ గా దేవర తెరకెక్కుతుంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.

Also Read : Sailesh Kolanu : నెగిటివ్ రివ్యూలు ఆపలేవు.. రెండ్రోజులే అయింది.. వెయిట్ చేయండి.. ‘సైంధవ్’ సినిమాపై డైరెక్టర్ ట్వీట్..

ఇక నేడు సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు దేవర నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. దేవర సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రానుంది. నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దేవర సినిమా థియేటర్స్ లో రిలీజయిన రెండు నెలల్లోపు ఓటీటీలోకి తీసుకొస్తారని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ దేవర డిజిటల్ హక్కులని భారీ ధరకు కొనుక్కున్నట్టు తెలుస్తుంది.