NTR: ఎన్టీఆర్ ని కలిసిన క్వీన్ ఎలిజబెత్.. వైరల్ అవుతున్న ఫోటో!
గత రెండు రోజులు నుంచి ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న వార్త బ్రిటన్ మహారాణి "క్వీన్ ఎలిజబెత్ II" మరణం. ఇక బ్రిటిష్ కాలనైజషన్ సమయంలో క్వీన్ ఎలిజబెత్ ఇండియాని రెండుసార్లు సందర్శించుకున్నారు. 1983లో ఆమె మూరోసారి ఇండియాకి రాగ, నవంబర్ 20న అప్పటి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు నాలుగు రోజులు పర్యటనకు రాణిదంపతులు కలిసి విచ్చేసారు.

NTR met England Queen Elizabeth in 1983
NTR: గత రెండు రోజులు నుంచి ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న వార్త బ్రిటన్ మహారాణి “క్వీన్ ఎలిజబెత్ II” మరణం. 1926 ఏప్రిల్ 21న లండన్ లో జన్మించిన ఈమె, 1952 ఫిబ్రవరి 6 మొదలు మరణాంతం వరకు రాణిగా జీవించారు. 70 సంవత్సరాల 214 రోజుల పాటు సాగిన ఆమె పాలన, బ్రిటీష్ రాజ్యపాలనలోనే చాలా సుధీర్ఘమైనిది.
ఆమె మరణానికి కొంతమంది భారతీయులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తుండగా, మరికొంతమంది..ఆమె మన తాతలని బానిసలుగా పాలించిన మహారాణి అని మర్చిపోకండి అంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఇక బ్రిటిష్ కాలనైజషన్ సమయంలో క్వీన్ ఎలిజబెత్ ఇండియాని రెండుసార్లు సందర్శించుకున్నారు.
1983లో ఆమె మూరోసారి ఇండియాకి రాగ, నవంబర్ 20న అప్పటి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు నాలుగు రోజులు పర్యటనకు రాణిదంపతులు కలిసి విచ్చేసారు. కాగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు, గవర్నర్ రాంలాల్ గారు ఆ జంటకి ఘన స్వాగతం పలికారు. ఆ పర్యటనలో ఆమె ఇక్రిశాట్, కుతుబ్ షాహి సమాధులు, BHELను సందర్శించుకున్నారు. అయితే ఆ సమయంలో రాణి దంపతులకు స్వాగతం పలుకుతున్న ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.