NTR – Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ఎన్టీఆర్.. ఆ పవర్‌ఫుల్ పాత్రని చేయబోతున్నారా..?
ప్రభాస్ 'కల్కి' ఎన్టీఆర్ హిందూ మైథలాజిలోని ఒక పవర్ ఫుల్ పాత్రని పోషించబోతున్నారంట. ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే..

NTR play important role in Prabhas Kalki 2898 AD movie
NTR – Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898AD’. ఈ సినిమా హిందూ మైథలాజి బ్యాక్ డ్రాప్ తో రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్.. మహా విష్ణు దశావతారంలోని కల్కి పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు.
వీరితో పాటు ఈ సినిమాలో మరికొందరు స్టార్స్ కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈక్రమంలోనే ఈ లిస్టులో.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో నటించబోతున్నారనే వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హిందూ మైథలాజిలోని ఒక పవర్ ఫుల్ పాత్రని పోషించబోతున్నారంట.
Also read : Sitara : ‘గుంటూరు కారం’లోని మహేష్ బాబు షర్టుతో.. ఏఎంబి మాల్‌లో సందడి చేసిన సితార..
ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే.. హిందూ పురాణాల్లోని ఊర మాస్ క్యారెక్టర్ ‘పరుశురాముడు’. ఈ సినిమాలో సప్త చిరంజీవులు అయిన వేదం వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి.. పాత్రలను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ని పరుశురాముడు పాత్రలో చూపించడానికి నిర్మాతలు ప్రియాంక, స్వప్న దత్ నిర్ణయం తీసుకున్నారట.
గతంలో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ‘మహానటి’ సినిమాలోనే తారక్.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో కనిపించాల్సి ఉంది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ని ప్రియాంక, స్వప్న ఎంత రిక్వెస్ట్ చేసినా అప్పుడు ఒప్పుకోలేదు. దీంతో ఇప్పుడు కల్కిలో పరుశురాం పాత్రకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Breaking Buzz :#JrNTR Playing as #Parushuram in #Prabhas #Kalki2898AD ✅ pic.twitter.com/dXlRnAx1I2
— newsforyou (@saic999) February 1, 2024