Pawan Kalyan – Aadya : కూతురు ఆద్యతో కలిసి పవన్ కళ్యాణ్ దుర్గమ్మ తల్లి దర్శనం.. ఫొటోలు చూశారా..?
పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి నిన్న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

Oawan Kalyan Visited Vijayawada kanakadurga Temple with his Daughter Aadya
Pawan Kalyan – Aadya : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిన్న విజవాడలో కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కూతురు ఆద్య కొణిదెల కూడా అమ్మవారి ఆలయానికి వచ్చారు.
పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి నిన్న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ఉపముఖ్యమంత్రికి అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనం అనంతరం పూజారులు వేదాశీర్వచనం చేసి పవన్ కళ్యాణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయంలో, ఆలయం వెలుపల అభిమానులకు, ప్రజలకు అభివాదం చేసారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం కూతురితో పవన్ కళ్యాణ్ అమ్మవారి ఆలయానికి వెళ్లిన ఫొటోలు వైరల్ గా మారాయి.