OMG.. రామ్ హార్డ్ వ‌ర్క్ చూశారా!

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 04:57 AM IST
OMG.. రామ్ హార్డ్ వ‌ర్క్ చూశారా!

Updated On : October 2, 2019 / 4:57 AM IST

హీరో రామ్ రీసెంట్ గా పూరి జగన్ దర్శకత్వంలో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 18వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమా కోసం జిమ్ లో రామ్ చేసే వర్కవుట్స్ మామూలుగా లేవు. దాదాపు 450 కిలోల బరువును లెగ్స్ తో లిఫ్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని రామ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

గతంలో రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ మూవీలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు లవ్ స్టోరీలే కావడంతో ఈ సారి అలా కాకుండా.. మంచి క్రైమ్ నేపథ్యంలో సినిమా తీయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా తమిళ రీమేక్ గా రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా దసరాకి ప్రారంభం కానుందట.