ఆ ఇద్దరు.. మరోసారి!

వాళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్లు.. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, మరొకరు మంచు మోహన్ బాబు. వీరి మధ్య అనుబంధం దశాబ్దాల నాటిదే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా వెలిగిన వీరు ఇప్పుడు కలిసి నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల ‘మా’ అసోసియేషన్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య బాండింగ్ మరోసారి బయటపడింది. స్టేజ్ మీద చిరంజీవి మోహన్ బాబును ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టాడు.
అయితే ఆఫ్ స్క్రీన్ అలా కనిపించిన ఇద్దరు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌ని షేర్ చేసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరంజీవి 152’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాకు సంబందించి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించారట. ఈ సినిమాలో నటించడానికి మోహన్ బాబు కూడా సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే క్లారిటీ ఇచ్చేందుకు టైమ్ తీసుకున్నాడట.
‘మాది టామ్ అండ్ జెర్రీల్లాంటి అనుబంధం’ అంటుండే మోహన్ బాబు.. చిరంజీవితో ఆయనకున్న స్నేహం గురించి చెబుతూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర అంటే అది విలన్ పాత్రే అని కూడా అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేందుకు మాత్రం టైం పడుతుంది.
చిరంజీవి హీరోగా చేసిన సినిమాల్లో విలన్ గా మోహన్ బాబు చాలా సినిమాల్లో చేశారు. అయితే ఇద్దరికీ చాలా గ్యాప్ వచ్చింది. ఖైదీ నెంబర్ 786, చక్రవర్తి సినిమాల్లో వీరు కలిసి నటించారు. విలన్‌గా మోహన్ బాబు చిరంజీవితో చేసిన చివరి సినిమా కొదమ సింహం.