‘ఆర్ఆర్ఆర్’ – సరిగ్గా సంవత్సరం క్రితం చరిత్రకు శ్రీకారం

2019 నవంబర్ 11 నాటికి ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమై సరిగ్గా ఒక సవంత్సరం అవుతోంది..

  • Published By: sekhar ,Published On : November 11, 2019 / 11:49 AM IST
‘ఆర్ఆర్ఆర్’ – సరిగ్గా సంవత్సరం క్రితం చరిత్రకు శ్రీకారం

Updated On : November 11, 2019 / 11:49 AM IST

2019 నవంబర్ 11 నాటికి ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమై సరిగ్గా ఒక సవంత్సరం అవుతోంది..

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాల తర్వాత.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే..

ఈ సినిమా 2018 నవంబర్ 11 ప్రారంభమైంది. 11వ తేది, 11వ నెల, ఉదయం 11 గంటలకు ముహూర్తం పెట్టి ఆసక్తి కలిగించాడు జక్కన్న.. 2019 నవంబర్ 11 నాటికి ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమై సరిగ్గా ఒక సవంత్సరం అవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్.. సరిగ్గా సంవత్సరం క్రితం చరిత్రకు శ్రీకారం’ అంటూ తారక్, చెర్రీ అభిమానులు రకరకాల ఫోటోలు డిజైన్ చేసి షేర్ చేస్తున్నారు. అలియా భట్ కథానాయికగా నటిస్తుండగా, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.. 2020 జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.