Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయినా నా సినిమా రిలీజ్ కష్టం అయింది.. సాంకేతికంగా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పారు..

నేడు సాయంత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయినా నా సినిమా రిలీజ్ కష్టం అయింది.. సాంకేతికంగా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పారు..

Pawan Kalyan

Updated On : July 24, 2025 / 9:21 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నేడు జులై 24న థియేటర్స్ లో రిలీజయింది. నిన్న రాత్రే ప్రీమియర్స్ కుడి ఆవేశారు. సాంకేతికంగా ఆసినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నా ఒక మంచి కథ, ఓ చరిత్ర చెప్పే ప్రయత్నం చేసారు. నేడు సాయంత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో నేను మొదటిసారి సక్సెస్ మీట్ కు హాజరయ్యా. ఇవాళ పొద్దున మంత్రివర్గ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖపై మాట్లాడాను. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న నేను పంచాయతీలు చేసి నా సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. నా జీవితకాలంలో ఏదీ తేలిగ్గా దొరకలేదు. డిప్యూటీ సీఎం కదా సినిమా సులువుగా రిలీజ్ అవుద్ది అనుకున్నా. కానీ అవ్వలేదు. గత వారం రోజులుగా నిద్రపోలేదు. గత రెండు రోజులు నేను మాట్లాడిన విషయాలు, చేసిన ప్రమోషన్స్ 29 ఏళ్ల సినీ జీవితంలో 10 శాతం కూడా చేయలేదు. సినిమా ప్రచార బాధ్యత తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది.

Also Read : Movie Theater : ఆసియాలోనే అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్.. అమరావతిలో.. స్టార్ నిర్మాత ప్లానింగ్.. ప్రభాస్ థియేటర్ ని మించి..

హరిహర వీరమల్లు విజయం ఏ స్థాయి అనేది నాకు తెలియదు. పీరియాడిక్ ఫిల్మ్స్ పై నాకు ఎప్పుడు సందేహం ఉండేది. వీఎఫ్ఎక్స్ కంటే కూడా ఎమోషన్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి. హరిహర వీరమల్లు మొదటి భాగంలో సాంకేతికంగా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఏవైనా పొరపాట్లు ఉంటే చెప్పండి. హరిహర వీరమల్లు రెండో భాగంలో వాటిని సరిదిద్దుకుంటాం. హరిహర వీరమల్లు పార్ట్ -2 తొందరగా జరగాలని కోరుకుంటున్నా. హరిహర వీరమల్లు రెండో భాగం 20 నుంచి 30 శాతం పూర్తైంది.

కృష్ణదేవరాయలు, రుద్రమదేవి.. లాంటి మన రాజుల చరిత్రలు ఉన్నాయి కానీ చెప్పడం లేదు. మొగల్ సామ్రాజ్యం తిప్పికొడితే 200 ఏళ్లు లేదు. చరిత్ర రాసినవాళ్లు మన రాజులపై చిన్నచూపు చూశారు. ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది. అయినా ఇప్పటికి ఔరంజేబు గురించి మాట్లాడితే మనవాళ్లు సెన్సిటివ్ అయిపోతారు. ఔరంగజేబు జిజియా పన్ను వసూలు చేసింది కథలో పెట్టి అందరికి తెలిసేలా చేసాము. ఔరంగజేబు చేసిన దారుణాలను దాచిపెట్టారు. హరిహర వీరమల్లు క్లైమాక్స్ అందరికి నచ్చడం చాలా ఆనందంగా ఉంది. హరిహర వీరమల్లు క్లైమాక్స్ లో మంచి, చెడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది.

Also Read : కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ ని మనం నెత్తిన పెట్టుకుంటే.. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ఇలా..

హరిహర వీరమల్లు విడుదలకు సహకరించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు, నిర్మాత విశ్వప్రసాద్ కు నా ధన్యవాదాలు. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా సినిమా విడుదల మైత్రీ మూవీ వల్లే సాధ్యమైంది. హరిహర వీరమల్లు బాయ్ కాట్ చేద్దామని బెదిరించినా బెదరలేదు. నా సినిమా మిమ్మల్ని అంత భయపెట్టిందా?. నా సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే బలంగా ఉన్నామని అర్థం. బలంగా ఉండపట్టే మన మీద నెగిటివిటీ మొదలైంది. ఔరంగజేబు గురించి చెబుతుంటే చాలా మందికి కోపమొస్తుంది. హిందువుగా ఉండి జిజియా ఎందుకు కట్టాలనే అంశం చెప్పడం ఆనందంగా ఉంది. సినిమా అనేది ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కనపెడితే ఎంత మందికి నచ్చిందనేది ముఖ్యం.

నా అభిమానులు సున్నితంగా ఉండొద్దు. అభిమానులు మీ జీవితాన్ని ఆస్వాదించండి. నేను కదా దెబ్బలు తినేది, మీకెందుకు. సోషల్ మీడియాలో నెగిటివ్ పై ఎలా దాడి చేయాలో అలా చేయండి. నా సినిమా కోహినూర్ కంటే మనిషి విజ్ఞానం గురించి చెప్పాను. కోహినూర్ పగిలిపోవచ్చు, విజ్ఞానం పోతే దొరకదు. ఈ దేశంలో వేదాలను కోహినూర్ లాగా మనుషులు భద్రపర్చలేదు. మన వేదాలను మనుషులు మనసులో పెట్టుకున్నారు, వాక్కు ద్వారానే అందరికి ఇచ్చారు. అదే మన దేశ సంస్కృతి గొప్పదనం. హరిహర వీరమల్లు ఈ అంశాన్ని చర్చించడంలో విజయం సాధించింది.

విజయం వస్తే పొంగిపోను, ఓడిపోతే కుంగిపోను. పార్టీ పెట్టి ఓడిపోవడం నాకు పెద్ద సక్సెస్ అనిపించింది. అడుగు ముందుకేసి వెళ్తేనే నేను డిప్యూటీ సీఎంగా నిలబడ్డా. సినిమాలను కాదు జీవితాన్ని, బంధాలను సీరియస్ గా తీసుకుందాం అని తెలిపారు.

Also Read : Pawan Kalyan : మూడు రోజులు.. మూడు ఊళ్లు.. ప్రమోషన్స్, షూటింగ్.. తెల్లారేసరికి క్యాబినెట్ మీటింగ్.. నీ ఓపికకు దండం సామీ..