Pawan Kalyan : వైజాగ్ లో నోవాటెల్ నుంచి బయటకు రాకుండా నన్ను ఆపేస్తే.. మీరంతా వచ్చారు.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..

ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు.

Pawan Kalyan : వైజాగ్ లో నోవాటెల్ నుంచి బయటకు రాకుండా నన్ను ఆపేస్తే.. మీరంతా వచ్చారు.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..

Pawan Kalyan

Updated On : July 23, 2025 / 7:32 PM IST

Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా రేపు జులై 24న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో నేడు వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కదా. మా నాన్నకు ట్రాన్సర్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్ని ఊళ్లు తిరిగేవాడ్ని. చెన్నైలో అన్నయ్య హీరో అయ్యాక నేను ఇంట్లోనే ఉండేవాడిని. అలాంటి నన్ను తీసుకెళ్లి చిరంజీవి గారు సత్యానంద్ కి ఇచ్చి వైజాగ్ కి పంపించారు. ఉత్తరాంధ్ర ఆట పాట సత్యానంద్ గారు నా గుండెల్లో నింపేశారు. ఇదే నోవాటెల్ లో రెండేళ్ల క్రితం నేను బయటకురాకూడదు అని అప్పటి పోలీసులు నన్ను ఆపారు, అరెస్ట్ చేయాలని చూసారు. అలాంటపుడు వైజాగ్ అంతా హోటల్ ముందు నా కోసం కూర్చుంది. అందుకే నా వైజాగ్ కోసం ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టాలి అనుకున్నా. టికెట్ రేట్లు తక్కువ పెట్టినా ఘన విజయం అందించిన నా ఫ్యాన్స్ కి ధన్యవాదాలు.

Also See : స్టేజిపై ఆ సినిమాల సాంగ్స్ పాడిన పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషీ..

ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని నా దగ్గరకు వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉన్నా నాకు సంబంధం లేదు సీఎం గారి దగ్గరకు వెళ్ళండి అని చెప్పాను. ఆయన ఇస్తే తీసుకోండి అని చెప్పాను. నారా లోకేష్ గారు పవన్ అన్న సినిమా హిట్ అవ్వాలి అని ట్వీట్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదట్లో ఎక్కువ ప్రమోషన్స్ చేసేవాడ్ని కాదు. ప్రమోషన్స్ లేకుండానే నా సినిమాలు విజయం అయ్యాయి. అదే అలవాటైపోయింది. అందుకే నేను మీడియాకు దూరంగా ఉన్నాను. నా సినిమాకు రండి అని నేను అడగలేను. నేను అడగకపోయినా మీరు వస్తారు. మా అన్నయ్య నువ్వేం చేస్తావు అని అడిగితే బతకాలని ఉంది అని చెపుదాం అనుకున్నా. కానీ అన్నయ్య కొడతాడని ఏం మాట్లాడలేదు.

సత్యానంద్ గారు వచ్చి పేపర్లు ఇచ్చి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయమనేవాళ్లు. నెల రోజులు చెన్నైలో ట్రైనింగ్ ఏం అవ్వట్లేదు అని అర్థమయి చిరంజీవికి చెప్పి వైజాగ్ తీసుకెళ్తా అని తీసుకొచ్చారు. సత్యానంద్ గారు మెల్లిగా అన్ని నేర్పించారు. నాకు ధైర్యం నేర్పించారు. నాకు జీవిత పాటలు నేర్పించారు. భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ లో నేర్చుకున్నాను యాక్టింగ్. నన్ను నమ్మింది మా అన్నయ్య, వదిన. అందుకే గెలిచాక వెళ్లి వాళ్ళ కాళ్లకు నమస్కరించాను. నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం, డైరెక్టర్ క్రిష్ వచ్చి 2019లో ఈ కథ చెప్పారు. ఆ తర్వాత కరోనా, రాజకీయ పరిస్థితులు వల్ల వాయిదా పడింది. అందుకే ఈ సినిమా కోసం నిల్చొని చేశాను. ఎక్కడా నేను తీసుకున్న శాఖలకు ఇబ్బంది లేకుండా నేను సినిమాలు చేశాను.

Also Read : Satyanand : నా ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్.. చిరంజీవి 1992లో నాకు ఫోన్ చేసి పిలిచి..

దాదాపు 30 శాతం సినిమాని క్రిష్ గారు డైరెక్ట్ చేసారు. మంచి దర్శకుడు ఆయన. మనం చేసేది చేసాం భగవంతుడు ఫలితం ఇవ్వాలి. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు దేశంలోని ఒక్కో ప్రాంతం నుంచి వచ్చారు. సినిమాకు కులం, మతం, ప్రాంతం లేదు. మేమంతా మీ కోసమే కష్టపడతాం. కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు సినిమా లేదు. సినిమాలోని ఎమోషన్స్ ని ఆయన తన నేపథ్య సంగీతంతో ముందుకు తీసుకెళ్లారు. నిన్న రాత్రి ప్రతి రీల్ సినిమా చూసాను. ఖుషీ తర్వాత నేను డబ్బింగ్ చెప్పేటప్పుడే చూస్తాను సినిమా ఆ తర్వాత మళ్ళీ సినిమా చూడటం మానేసాను. సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎడ్యుకేట్ కూడా చేయాలి.

కోహినూర్ గురించి ఈ కథ సాగుతుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఔరంగజేబు సింహాసనం మీద ఉన్న కోహినూర్ ని దొంగతనం చేసుకొని రావాలి. ఔరంగజేబు దగ్గరికి వెళ్లాడా? కలిశాడా అనేది ఈ సినిమా ఎండింగ్ మిగిలింది నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది. నేను ఎందుకు ఫైట్స్ కంపోజ్ చేశాను అంటే ఒక్కడు కొడితే వంద మంది పడిపోవడం లాంటి లాజిక్ లేనివి నాకు అంతగా ఎక్కవు. అందుకే నా మార్షల్ ఆర్ట్స్ ని వాడి చేశాను. మీ అందరి కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నా అని అన్నారు.

Also See : హరిహర వీరమల్లు.. వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి..