Pawan Kalyan Wife : తనయుడు కోలుకోవడంతో.. తిరుమలలో అన్నదానానికి పవన్ కళ్యాణ్ భార్య విరాళం.. ఎంతిచ్చారంటే..
అన్నా కొణిదెల నేడు వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Pawan Kalyan Wife Anna Lezhneva Donated to TTD for Food in the Name of Mark Shankar
Pawan Kalyan Wife : ఇటీవల పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలయిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్నాక మార్క్ శంకర్ ని, భార్య అన్నా ని పవన్ హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కొడుకు కోలుకోవడంతో పవన్ భార్య అన్నా కొణిదెల తిరుమల వచ్చి నిన్న స్వామివారికి తలనీలాలు అర్పించిన సంగతి తెలిసిందే.
అన్నా కొణిదెల నేడు వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
Also Read : HIT 3 Trailer : నాని ‘హిట్-3 ట్రైలర్’వచ్చేసింది.. గూస్ బంప్స్ అంతే..
అనంతరం అన్నా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి వెళ్లి కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. ఒక రోజు మధ్యాహ్న భోజనానికి టీటీడీకి అయ్యే ఖర్చు 17 లక్షలను అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు.
Also See : Pawan Kalyan Wife: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల.. వీడియో