శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల
భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు.

Pawan Kalyan Wife Anna Lezhneva
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఆదివారం శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఆమె తిరుమలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు.
ఆ తర్వాత ద్మావతి విచారణ ఆఫీసు వద్దకు ఆమె వెళ్లారు. అక్కడ శ్రీవారికి తలనీలాలు సమర్పించి, భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి ఆమె తిరుమలలోనే బస చేస్తారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స తీసుకున్నాక కోలుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అన్నా కొణిదెల తిరుమల స్వామి వారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకు ముందు అన్నా కొణిదెల హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని, రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. అన్య మతస్థులరాలు కావడంతో ఆమె టీటీడీకి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. హిందూ మతంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చారు.
తల వెంట్రుకలను మనిషి శరీర సౌందర్యానికి ముఖ్యమైనవిగా భావిస్తారు. అటువంటి తలనీలాలు సమర్పించడం అంటే భగవంతుని ముందు అహంకారాన్ని త్యజించటంగా హిందువులు భావిస్తారు. చాలా మంది భక్తులు ఏదైనా కోరిక నెరవేరినప్పుడు మొక్కుబడిగా ఇస్తారు. తలనీలాలు సమర్పించడం ద్వారా భక్తులు తమను తాము శారీరకంగా, మానసికంగా శుద్ధి చేసుకుంటున్న భావనను పొందుతారు.