Balakrishna – Pawan Kalyan : సీఎం చంద్రబాబు ఓకే.. ఆ రోజు బాలయ్య కోసం డిప్యూటీ సీఎం వస్తారా?
ఇటీవల ఎన్నికల ముందు నుంచి బాలయ్య, పవన్ బాగా క్లోజ్ అయ్యారు.
Balakrishna – Pawan Kalyan : సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ 14 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్ తాతమ్మ కల సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అప్పట్నుంచి 50 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. తాతమ్మ కల 29 ఆగస్టు 1974లో రిలీజయింది. నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు అవుతుండటంతో ఓ పక్క అభిమానులు, మరో పక్క సినీ పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయబోతున్నారు.
ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ తరపున పలు యూనియన్స్ కలిసి హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలని 1 సెప్టెంబరు 2024న చేయబోతున్నారు. దీంతో ఈ వేడుకపై టాలీవుడ్ తో పాటు బాలకృష్ణ అభిమానులకు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు కావడంతో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తారని సమాచారం. దీంతో ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ నడుస్తుంది. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలకు పవన్ కళ్యాణ్ వస్తారా అని సందేహం వ్యక్తం అవుతుంది. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఇలా బాలయ్యతో సమానంగా ఉన్న స్టార్ హీరోలు టాలీవుడ్ నుంచి వస్తారో రారో అనుకున్నా ఏపీ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా పవన్ కళ్యాణ్ వస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు 100 శాతం ఉండటంతో ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చని తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల ముందు నుంచి బాలయ్య, పవన్ బాగా క్లోజ్ అయ్యారు. కలిసి ప్రచారం చేశారు, బాలయ్య అన్‌స్టాపబుల్ ఈవెంట్ కి పవన్ వచ్చారు. దీంతో మరోసారి పవన్ బాలయ్య కోసం వస్తారా? ఈ ఇద్దర్ని ఒకే స్టేజిపై ఇంకోసారి చూడొచ్చా? బాలయ్య గురించి పవన్ మాట్లాడతారా అని అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు వచ్చినా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చినా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలు ఫ్యాన్స్ కి స్పెషల్ గా గుర్తుండిపోవడం ఖాయం.
Also Read : Pawan Kalyan – Vikram : డిప్యూటీ సీఎం అవ్వడం మామూలు విషయం కాదు.. పవన్‌పై విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక ప్రస్తుతం బాలయ్య NBK109 సినిమా షూటింగ్ తో బిజీగానే ఉంటూ మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచి ప్రజాసేవలో ముందుకెళ్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అంతా సెప్టెంబర్ 1 జరిగే బాలయ్య స్వర్ణోత్సవ సంబరాల ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.