Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?

తెలుగు తెరపై రాముడు అంటే ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే వెండితెరపై మొదటి రాముడు ఎవరు? ఎవరెవరు రాముడిగా కనిపించారో తెలుసా?

Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?

Prabhas Adipurush special story tollywood ramudu roles list telugu

Adipurush : రామాయణం కథాంశంతో ఆడియన్స్ ముందుకు ఈ వారం వచ్చేందుకు సిద్దమైన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ (Prabhas) రాముడిగా సినిమాలో నటిస్తున్నాడు. అయితే తెలుగు తెర పై ఇప్పటి వరకు ఎంతమంది నటులు శ్రీరాముడిగా కనిపించి అలరించారో తెలుసా? వారి గురించి ఇక్కడ తెలుసుకోండి.

Adipurush : హ‌నుమంతుడి ప‌క్క సీటు రేటుపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్‌.. ఎంతో తెలుసా..?

చలనచిత్ర రంగంలో తొలిసారి రాముడిగా కనిపించి అలరించిన నటుడు యడవల్లి సూర్యనారాయణ. 1932లో వచ్చిన ‘పాదుకా పట్టాభిషేకం’ మూవీలో సూర్యనారాయణ రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో రెండో టాకీ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా తరువాత 1944 లో వెండితెరకు రెండో రాముడిగా పరిచయమైంది అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao).

అక్కినేని హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమాలోనే రాముడిగా కనిపించారు. ఘంటసాల బలరామయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ‘శ్రీ సీతారామ జననం’ పేరుతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత 1945 లో ‘పాదుకా పట్టాభిషేకం’ పేరుతోనే సి ఎస్ ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Adipurush : ఆదిపురుష్‌లో సీతగా కృతిసనన్‌ని ఎంపిక చేయడానికి రీజన్ తెలుసా.. కృతి చెప్పిన ఆన్సర్!

ఇక ఈ చిత్రాలు తరువాత ఎన్టీఆర్ శకం మొదలైంది. రాముడిగా సీనియర్ ఎన్టీఆర్ (NTR) ని ప్రజలు ఆరాదించేలా నటించి మెప్పించారు. మొట్ట మొదటిగా 1959 లో సంపూర్ణ రామాయణం సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. అలాగే లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లో కూడా రాముడిగా కనిపిస్తూ వచ్చారు. రాముడిగా కనిపించడమే కాదు రాముని కథని దర్శకుడిగా కూడా తెరకెక్కించారు రామారావు.

ఎన్టీఆర్ దర్శకుడిగా చేసిన రామకథలు.. శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ కల్యాణం. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే రాముడిగా కనిపిస్తే, సీతారామ కల్యాణం సినిమాలో మాత్రం హరనాథ్‌ రాముడిగా చేశారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణుడి పాత్రలో కనిపించారు. హరనాథ్‌ ఈ సినిమా తరువాత ‘శ్రీరామకథ’ చిత్రంలో కూడా రాముడిగా కనిపించి అలరించారు.

Adipurush : ఆ థియేటర్స్‌లో ఆదిపురుష్ నో రిలీజ్.. కలెక్షన్స్‌కి దెబ్బ పడనుందా..?

అలాగే 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు, 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్‌.. శ్రీరామచంద్రులుగా కనిపించి ఆకట్టుకున్నారు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రాలు తరువాత దాదాపు దశాబ్దాలు పూర్తి అయ్యిన తరువాత మళ్ళీ వెండితెర పై రాముడి పాత్ర కనిపించింది. ఇక ఆ పాత్రని జూనియర్ ఎన్టీఆర్ (NTR) పోషించడం విశేషం.

1997లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్‌ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ఆ తరువాత నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్‌ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్‌ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు.

Adipurush : ఆదిపురుష్ రన్ టైం లాక్ అయ్యింది.. అన్ని గంటల సినిమానా?

సీనియర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ లు తరువాత నందమూరి కుటుంబం నుంచి రాముడిగా కనిపించింది బాలకృష్ణ (Balakrishna). బాపు తెరకెక్కించిన ‘శ్రీ రామరాజ్యం’ చిత్రంలో నీలమేఘశ్యాముడిగా బాలయ్య ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయ్యింది. 12 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు వెండితెర పై రామ కథ రాబోతుంది. ఈసారి రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. మరి రాముడిగా ప్రభాస్ ఎంతలా ఆకట్టుకుంటాడో చూడాలి.