Prabhas: మారుతి కోసం ప్రభాస్ ఒకేసారి అన్నిరోజులా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ఈఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపులు ఆయన నటిస్తున్న ‘సలార్’ మూవీపై పడ్డాయి. అయితే ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Prabhas Allocates Bulk Dates To Director Maruthi
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి నెక్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ఈఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపులు ఆయన నటిస్తున్న ‘సలార్’ మూవీపై పడ్డాయి. అయితే ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
Prabhas : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో సినిమా.. నిజమేనా?
కాగా, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మారుతి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పుడు భారీగా డేట్స్ కేటాయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను ముందుగా పూర్తి చేసి, మిగతా సినిమాలకంటే ముందుగా రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట.
హార్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమా కోసం ఫిబ్రవరిలో ఏకంగా 15 రోజుల డేట్స్‌ను మారుతి కోసం కేటాయించాడట ప్రభాస్. ఈ సమయంలో ప్రభాస్‌కు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మారుతి భావిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.