Prabhas : హోంబ‌లే ఫిల్మ్స్ ప్లాన్ మూమూలుగా లేదు.. ప్ర‌భాస్‌తో 3 మూవీస్‌.. సంవ‌త్స‌రానికి ఒక‌టి చొప్పున..

బాహుబ‌లి సిరీస్‌తో ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Prabhas : హోంబ‌లే ఫిల్మ్స్ ప్లాన్ మూమూలుగా లేదు.. ప్ర‌భాస్‌తో 3 మూవీస్‌.. సంవ‌త్స‌రానికి ఒక‌టి చొప్పున..

Prabhas Inks Multi Picture Deal With Hombale Films

Updated On : November 8, 2024 / 2:04 PM IST

బాహుబ‌లి సిరీస్‌తో ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. ఇక ప్ర‌భాస్ సైతం వ‌రుస సినిమాల‌ను చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవ‌లే స‌లార్‌, క‌ల్కి సినిమాల‌తో భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ అదిరిపోయే వార్త‌ను అభిమానుల‌తో పంచుకుంది.

త‌మ నిర్మాణ సంస్థలో ప్ర‌భాస్ మూడు చిత్రాల‌ను చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఒప్పందం పూర్తి అయిన‌ట్లు వెల్ల‌డించింది. స‌లార్‌-2 చిత్రంతో ఇది ప్రారంభం అవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇది కాక మ‌రో రెండు పెద్ద సినిమాల్లో ప్ర‌భాస్ న‌టించ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. 2026, 2027, 2028ల్లో ఈ చిత్రాలు ఉండనున్నట్లు చెప్పింది.ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేసింది.

Nitin Chauhan : టెలివిజ‌న్ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. నటుడు నితిన్ చౌహాన్ క‌న్నుమూత‌..

కాగా.. స‌లార్ 2కు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు కాగా.. మిగిలిన రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు అనే విష‌యాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి సంవ‌త్స‌రానికి ఓ మూవీ చొప్పున మూడు మూవీలు చేయ‌నున్న‌ట్లు చెప్ప‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా స‌లార్ తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్ర‌భాస్‌తో మ‌రిన్ని చిత్రాల‌ను చేయాల‌ని భావించిన‌ట్లుగా తెలుస్తోంది. సలార్‌తో పాటు కేజీఎఫ్‌, కాంతార వంటి సినిమాల‌ను తెర‌కెక్కించి అగ్ర నిర్మాణ సంస్థ‌గా పేరుగాంచింది హోంబ‌లే ఫిల్మ్స్.

Game Changer : రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ నుంచి కొత్త పోస్ట‌ర్‌.. సాగ‌ర‌క‌న్య‌లా మెరిసిపోతున్న కియారా!