సాహో : హిందీలో డార్లింగే డబ్బింగ్ చెప్తాడట!

ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు కాస్త కష్టం అనిపించింది కానీ, తర్వాత నుండి అలవాటైపోయింది. హిందీలో నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను'.. అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు ప్రభాస్..

  • Published By: sekhar ,Published On : May 11, 2019 / 08:31 AM IST
సాహో : హిందీలో డార్లింగే డబ్బింగ్ చెప్తాడట!

Updated On : May 11, 2019 / 8:31 AM IST

ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు కాస్త కష్టం అనిపించింది కానీ, తర్వాత నుండి అలవాటైపోయింది. హిందీలో నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను’.. అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు ప్రభాస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా, సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. సాహో.. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ బాంబేలో షూట్ చేసారు. రీసెంట్‌గా ఓ ఇంగ్లీష్ డైలీకిచ్చిన ఇంటర్వూలో ప్రభాస్ సాహోకి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

‘నేను సాహో సినిమా కోసం హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు కానీ, ఇంట్లో హిందీ మాట్లాడడం.. హిందీలో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి.. మన హైదరాబాదీ హిందీలో అయితే ఉర్దూ మిక్స్ ఉంటుంది. సాహోని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి, భాష పరంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా వన్ మంథ్ పాటు ఒక టీచర్‌ని పెట్టుకుని హిందీ భాషని పూర్తిగా నేర్చుకున్నాను. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు కాస్త కష్టం అనిపించింది కానీ, తర్వాత నుండి అలవాటైపోయింది. హిందీలో నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను’.. అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు..

బాహుబలి తర్వాత ప్రభాస్‌కి ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ భాషలోనే డబ్బింగ్ చెప్తే, అక్కడి ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.. ఈ సినిమాని తమిళ్, మళయాలంలోనూ విడుదల చెయ్యనున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న సాహోని 2019 ఆగస్టు 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.