Puneeth Rajkumar: ‘అప్పు.. అప్పు..’ అంటూ.. కూతురు వచ్చాకే అంత్యక్రియలు!

సూపర్‌స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, పవర్ స్టార్‌గా మారి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గుండె చప్పుడు ఆగింది.

Puneeth Rajkumar: ‘అప్పు.. అప్పు..’ అంటూ.. కూతురు వచ్చాకే అంత్యక్రియలు!

Punith Rajkumar (2)

Updated On : October 30, 2021 / 10:40 AM IST

Puneeth Rajkumar: పాతికేళ్లకు స్టార్.. ఇరవై ఏళ్లలో 30 సినిమాలు.. వందల కోట్ల వ్యాపారం.. సూపర్‌స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, పవర్ స్టార్‌గా మారి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గుండె చప్పుడు ఆగింది. కోట్లాది మంది అభిమానుల్ని కన్నీటి సంద్రంలో నెట్టేశారు పునీత్ రాజ్‌కుమార్.

కన్నడ కంఠీరవ రాజ్‌‌కుమార్‌ వారసుడిగా అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలోనే సినిమా రంగంలో రాణించి, 46ఏళ్లకే గుండెపోటుతో మరణించారు పునీత్ రాజ్‌కుమార్. పునీత్ మృతితో కర్ణాటకలో హైఅలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. పునీత్ మరణవార్త తెలియగానే అభిమానులు బోరుమని విలపిస్తూ.. ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు.

పునీత్ రాజ్‌ కుమార్ కూతురు వచ్చాకే అంత్యక్రియలు జరగనున్నాయి. అమెరికాలో ఉన్న కూతురు వందిత వచ్చిన తర్వాతే అంతక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయి. పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయం ప్రస్తుతం కంఠీరవ స్టేడియంలో ఉండగా.. కూతురు వచ్చాక ఆమెను అక్కడకు తీసుకుని వెళ్లి, చూసిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

బెంగుళూరు అంతగా దిగ్భ్రాంతి వాతావరణం నెలకొని ఉండగా.. అభిమానులు అప్పు.. అప్పు అంటూ వేలాదిగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 6వేల మంది పోలీసులతో 40 KSRP ప్లాటూన్లు, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, RAFని మోహరించి సెక్యురిటీని పర్యవేక్షిస్తున్నారు.