టీవీ ఆర్టిస్ట్ కుశాల్ ఆత్మహత్య

  • Published By: vamsi ,Published On : December 29, 2019 / 04:11 AM IST
టీవీ ఆర్టిస్ట్ కుశాల్ ఆత్మహత్య

Updated On : December 29, 2019 / 4:11 AM IST

బుల్లితెర న‌టుడు కుశాల్‌ ఆత్మహ‌త్యతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో కుశల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హిందీ సీరియ‌ల్స్‌లో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కుశాల్‌ మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్థారించారు

కుశల్ రాసిన సూసైడ్‌ నోట్‌‌ లో త‌న చావుకు ఎవ‌రూ బాధ్యులు కారు అని తన ఆస్తిని తల్లిదండ్రులు, కుమారుడికి సమానంగా పంచండి అంటూ వెల్లడించాడు. అయితే ఆయన బలవన్మరణానికి కారణం వ్య‌క్తిగ‌త‌, వృతిప‌ర‌మైన సమస్యలేవైనా అయి ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కుశాల్‌ పంజాబీ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

టీవీ స్క్రీన్‌పై మంచి ఫామ్‌లో ఉన్న కుశల్‌.. ఆత్మహత్య ఎందుకు చసుకున్నాడు అనే విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. కుశాల్‌ లేడంటే నమ్మలేకపోతున్నాం అంటూ ట్విట్టర్ వేదికగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.