Radhe Shyam: ఎట్టకేలకు రాధేశ్యామ్ డేట్ ఫిక్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన...

Radhe Shyam: ఎట్టకేలకు రాధేశ్యామ్ డేట్ ఫిక్స్!

Radhe Shyam Hindi Ott Release Date Fixed In Netflix

Updated On : April 30, 2022 / 11:34 AM IST

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా తొలిరోజే మిక్సిడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా అనుకున్న మేర సక్సెస్ కాలేకపోయింది. థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు జనం కూడా పెద్దగా ఆసక్తిని చూపలేదు.

Radhe Shyam: ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన రాధేశ్యామ్.. ఫలితం ఎలా ఉంటుందో?

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయగా, తెలుగు ఓటీటీలో ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయగా, అందులో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. అయితే నార్త్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు రాధేశ్యామ్ హిందీ భాషలో ఓటీటీలో రిలీజ్ చేయకపోవడంతో అక్కడి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. రాధేశ్యామ్ హిందీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

Radhe Shyam: నష్టాలపాలైన బయ్యర్లు.. రాధేశ్యామ్ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!

అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అవుతోంది. ఎట్టకేలకు రాధేశ్యామ్ హిందీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు నిర్వాహకులు అనౌన్స్ చేశారు. రాధేశ్యామ్ చిత్రాన్ని మే 4న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇక ఈ వార్తతో నార్త్ ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులను ఓ మోస్తరుగా అలరించిన రాధేశ్యామ్ ఓటీటీలో ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను భారీ లెవెల్‌లో తెరకెక్కించాడు.