కొలంబోలో పేలుళ్లు : నటి రాధిక సేఫ్

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 07:36 AM IST
కొలంబోలో పేలుళ్లు : నటి రాధిక సేఫ్

Updated On : April 21, 2019 / 7:36 AM IST

కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనితో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. భారత ప్రభుత్వం దీనిని ఖండించింది. 

ఇదిలా ఉంటే సీనియర్ నటి రాధిక.. పేలుళ్ల సమయంలో అక్కడనే ఉన్నారు. కొలంబోలోని సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ ఆమె బస చేశారు. ఘటన జరిగే కొద్దిసేపటి ముందు ఆమె ఈ హోటల్‌ను ఖాళీ చేశారు. దీనితో రాధిక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. స్వయంగా ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పేలుళ్లు తనకు షాక్ తెప్పించాయని..ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు. 

శ్రీలంలోక జరిగిన ఈ ఘోరకలిని పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసిన మృతదేహాలుతో బీభత్సంగా మారిపోయాయి. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.