పెళ్లి సందడి : వెంకటేష్ కూతురి పెళ్లిలో చరణ్ దంపతులు

  • Published By: madhu ,Published On : March 24, 2019 / 10:13 AM IST
పెళ్లి సందడి : వెంకటేష్ కూతురి పెళ్లిలో చరణ్ దంపతులు

Updated On : March 24, 2019 / 10:13 AM IST

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వెడ్డింగ్ వేడుకలు జైపూర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. అత్యంత సమీప బంధువులకు, స్నేహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు వెంకీ ఫ్యామిలీ. దీనితో ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు పొక్కడం లేదు. అయితే..వేడుకకు హాజరైన సెలబ్రెటీల ఫొటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి వినాయక్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి..అశ్రితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇరు ఫ్యామిలీ పెద్దలు ఒకే చెప్పారు. 
Read Also : నయనతారపై సంచలన వ్యాఖ్యలు: ప్రముఖ నటుడిని వెలి వేయాలంటూ డిమాండ్

పెళ్లి కంటే ముందుగా నిర్వహించే సంగీత్ వేడుకల్లో ‘రానా దగ్గుబాటి’, ‘నాగ చైతన్య’తో పాటు ‘సమంత అక్కినేని’లు సందడి చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తేజ దంపతులు కూడా సందడి చేశారు. సంగీత్ కార్యక్రమంలో రానా – చరణ్ లు హల్ చల్ చేశారని టాక్. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మీ వైవాహిక జీవితం నూరేళ్ళ పాటు చక్కగా కొనసాగాలి’ అంటూ ఉపాసన ట్వీట్ చేసి ఆశ్రితకు శుభాకాంక్షలు తెలియచేసింది. అంతేకాదు రానా సీ (రామ్ చరణ్) తో కలిసి హడావిడి చేస్తున్నాం అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. 

టాలీవుడ్‌లో సీనియర్ హీరో వెంకటేష్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు వెంకీ. ఆయన నటించిన చిత్రాలు అభిమానులను అలరిస్తున్నాయి. ఇటీవలే ‘వరుణ్ తేజ’తో కలిసిన నటించిన ‘ఎఫ్ 2’ సినిమా సక్సెస్ కావడంతో ’వెంకటేష్’ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. మరో చిత్రానికి కూడా ఆయన సైన్ చేశాడు. ‘వెంకీ మామ’ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.