Ram Charan: ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ‘నాటు’ క్లాస్!

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం వద్ద 2023 గ్రీన్‌కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ఫార్ములా రేస్ అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రేస్‌ను తిలకించేందుకు పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు బిజినెస్ టైకూన్స్ కూడా ఈ కార్ రేసును వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.

Ram Charan: ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ‘నాటు’ క్లాస్!

Ram Charan Dances Naatu Naatu Step With Anand Mahindra

Updated On : February 11, 2023 / 9:25 PM IST

Ram Charan: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం వద్ద 2023 గ్రీన్‌కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ఫార్ములా రేస్ అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రేస్‌ను తిలకించేందుకు పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు బిజినెస్ టైకూన్స్ కూడా ఈ కార్ రేసును వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.

Ram Charan : కాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని కోరికను తీర్చిన రామ్‌చరణ్..

ఇక కార్ రేస్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సందడి చేశారు. కాగా, ప్రముఖ బిజినెస్ ఐకాన్ ఆనంద్ మహీంద్రాతో చరణ్ చాలా సేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రాతో చరణ్ సరదాగా ‘నాటు నాటు’ స్టెప్పులు వేశారు. చరణ్‌తో ఇలా నాటు స్టెప్పులు వేయడం సంతోషంగా ఉందని ఆనంద్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. చరణ్ తనకు నాటు నాటు స్టెప్పులు నేర్పాడని.. ఆయనతో కలిసి హైదరాబాద్ ఈ-రేస్‌ను వీక్షించడం సంతోషాన్ని కలిగించిందని ఆనంద్ పేర్కొన్నారు.

కాగా.. ఆనంద్ మహీంద్రా, చరణ్‌లు కలిసి చేసిన నాటు నాటు డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక చరణ్‌తో పాటు పలువురు స్టార్స్ ఈ కార్ రేస్‌లో సందడి చేశారు.