Ram Charan : ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్‌ని జనసేనకి అందించిన చరణ్ అభిమానులు.. ఎంతో తెలుసా?

ఆరంజ్ రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ని రామ్ కాహారం అభిమానులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి..

Ram Charan : ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్‌ని జనసేనకి అందించిన చరణ్ అభిమానులు.. ఎంతో తెలుసా?

Ram Charan fans gave orange overall collections to pawan kalyan

Updated On : May 19, 2023 / 5:12 PM IST

Ram Charan Orange : మెగాపవర్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ ఇటీవల రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రిందటి రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పుడు డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఆ రెస్పాన్స్ చూసి నిర్మాత నాగబాబు, దర్శకుడు భాస్కర్ ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమాని జపాన్ లో కూడా రీ రిలీజ్ చేయాలనీ డిమాండ్ రావడంతో.. అక్కడ కూడా రిలీజ్ చేశారు.

Pawan – Charan : 15 ఏళ్ళ బ్యాడ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి బాబాయ్ అబ్బాయి గేమ్ చెంజర్స్ అవుతారా?

కాగా ఈ రీ రిలీజ్ పై వచ్చే కలెక్షన్స్ అన్నిటిని జనసేన పార్టీకి ఫండ్ రూపంలో ఇస్తానంటూ నాగబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీ మొత్తం కలెక్షన్స్ చరణ్ అభిమానులు మరియు నాగబాబు కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రూ.1.05 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఆ మొత్తాన్ని జనసేన కార్యాచరణ పనుల కోసం అందజేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ.. రామ్ చరణ్ అభిమానులకు థాంక్యూ చెబుతూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Rajinikanth : రజినీకాంత్‌కి అదే చివరి సినిమా.. తమిళ దర్శకుడు సంచలన కామెంట్స్!

ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ క్లైమాక్స్ కి సంబంధించిన షూట్ ని పూర్తి చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై దసరా సమయంలో క్లారిటీ ఇస్తామంటూ నిర్మాత దిల్ రాజు తెలియజేశాడు.