సత్యప్రభ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రామ్ చరణ్

  • Published By: sekhar ,Published On : November 20, 2020 / 06:19 PM IST
సత్యప్రభ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రామ్ చరణ్

Updated On : November 20, 2020 / 6:26 PM IST

Satya Prabha: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారు.
Andhra Pradesh: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత | ఏపీ News in Teluguకాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బెంగళూరు హాస్పిటల్‌కు చేరుకుని సత్యప్రభ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన మృతితో రాజకీయాల్లోకి వచ్చారు.


2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. ఇక సత్యప్రభ మరణంతో టీడీపీలో విషాదం నెలకొంది.