Dior x Air Jordan 1 sneakers : రణ్‌బీర్ కపూర్ ధరించిన ఈ షూ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

సెలబ్రిటీలు ఏం చేసినా స్పెషలే.. డ్రెస్సింగ్ స్టయిల్ నుంచి వారు వాడే ప్రతి బ్రాండ్ వస్తువుకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Dior x Air Jordan 1 sneakers : రణ్‌బీర్ కపూర్ ధరించిన ఈ షూ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Dior X Air Jordan 1 Sneakers (1)

Updated On : March 29, 2021 / 5:49 PM IST

Dior x Air Jordan 1 sneakers : సెలబ్రిటీలు ఏం చేసినా స్పెషలే.. డ్రెస్సింగ్ స్టయిల్ నుంచి వారు వాడే ప్రతి బ్రాండ్ వస్తువుకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రణ్ బీర్ ధరించిన షూ బ్రాండ్ పేరు మారుమోగిపోతోంది. అంతేకాదు.. రణ్ బీర్ ధరించిన షూ ధర ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే..

Shoes

అతడు ధరించిన స్నీకర్స్‌ (స్పోర్ట్స్‌ షూస్‌) నైకి అండ్‌ డియోర్‌ (Dior x Air Jordan 1 collab) లిమిటెడ్‌ ఎడిషన్‌.. ఈ స్నీకర్స్‌ ధర అక్షరాలా 5లక్షల 80వేలు అంట.. మీరు విన్నది నిజమే.. వాస్తవానికి బ్రాండ్ షూ ధరను గత ఏడాదే తగ్గించింది. షూపై భాగంలో వైట్, గ్రే కలర్, ఎయిర్ డాయిర్ బ్రాండింగ్ తో వింగ్స్ లోగో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్సీకర్న్ రెండు వైపులా స్వూష్ లోగో ట్రెండీ లుక్‌ అదిరిపోయింది.

Shoe

ఎయిర్ జార్డన్ 1 కంపెనీ ఈ షూను 1985లో డిజైన్ చేసింది. డయర్ అండ్ జార్దన్ సంస్థ హై టాప్ వెర్షన్ లో 8వేల జతల షూ, లో టాప్ వెర్షన్ లో 4,700 జతలను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడా ఈ షూను రణ్ బీర్ ధరించడంలో మరింత పాపులర్ అయింది. రణ్ బీర్ వాడి పడేసిన కూడా ఈ బ్రాండ్ షూ ధర 8వేల డాలర్ల నుంచి 10వేల డాలర్ల వరకు రీసేల్ వాల్యూ పలుకుతుంది కూడా. ప్రస్తుతం అలియా భట్‌తో ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌ కపూర్‌.. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడట..