Rashmika Mandanna : రష్మికకు ముద్దుపెట్టిన అభిమాని.. సిగ్గుపడిపోతూ రష్మిక ఏం చేసిందో చూడండి..

రష్మికకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అక్కడ కూడా ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

Rashmika Mandanna : రష్మికకు ముద్దుపెట్టిన అభిమాని.. సిగ్గుపడిపోతూ రష్మిక ఏం చేసిందో చూడండి..

Rashmika Mandanna kissed by A Lady Fan in Airport video goes Viral

Updated On : October 31, 2023 / 9:35 AM IST

Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగులో, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో రణబీర్(Ranbir) సరసన యానిమల్(Animal) సినిమాతో రాబోతుంది. వచ్చే సంవత్సరం పుష్ప 2(Pushpa 2)తో రాబోతుంది. ఇవే కాక రష్మిక చేతిలో ఇంకో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం. అందులో శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా ఒకటి. ఇంకోటి రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా, రాహుల్ రవీంద్రన్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది.

ఇక రష్మికకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అక్కడ కూడా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. పుష్ప సినిమాలో సామి సామి పాటలో స్టెప్పులతో పిల్లలకు కూడా ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. తాజాగా రష్మిక వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Also Read : Ashu Reddy : ఇంకో కొత్త కార్ కొన్న అషురెడ్డి.. వేణుస్వామితో స్పెషల్ పూజలు..

రష్మిక విమానాశ్రయంలో వెళ్తుంటే ఆమె అభిమాని ఒక చిన్న అమ్మాయి వచ్చి రష్మికని బుగ్గలు పట్టుకొని ముద్దు చేసింది. అలాగే రష్మిక బుగ్గ మీద ముద్దు పెట్టింది. దీంతో రష్మిక కళ్ళు మూసుకొని తెగ సిగ్గుపడిపోయింది. అనంతరం వాళ్ళు ఆటోగ్రాఫ్ అడగ్గా ఇచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి రష్మిక అభిమానులు మా రష్మిక బంగారం, చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది పాత వీడియో అని, ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతుందని తెలుస్తుంది.