Renu Desai – Akira Nandan : అకిరా మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. బీజేపీ వ్యక్తిగా నేను..

అకిరా నందన్ పీఎం నరేంద్ర మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Renu Desai – Akira Nandan : అకిరా మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. బీజేపీ వ్యక్తిగా నేను..

Renu Desai Emotional Post on Akira Nandan Meets with PM Narendra Modi

Updated On : June 6, 2024 / 6:59 PM IST

Renu Desai – Akira Nandan : ఏపీ ఎన్నికల్లో పవన్ గెలిచిన దగ్గర్నుంచి తనయుడు అకిరా నందన్ నాన్న వెంటే తిరుగుతున్నాడు. ఇక పవన్ కూడా ఎక్కడికి వెళ్లినా అకీరాను తీసుకెళ్తున్నాడు. అకీరాను చంద్రబాబు నాయుడుకి, పీఎం నరేంద్రమోదీకి కూడా పరిచయం చేశాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే అకిరా నందన్ పీఎం నరేంద్ర మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read : Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ సంబరాల్లో సాయి ధరమ్ తేజ్ అల్లరి.. అకిరాతో కలిసి..

రేణు దేశాయ్ బీజేపీ సపోర్టర్ అని తెలిసిందే. గతంలో పలు మార్లు బీజేపీకి మద్దతుగా, మోదీకి మద్దతుగా అనేక పోస్టులు పెట్టింది. తాజాగా అకిరా నందన్ మోదీని కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ.. నేను ఎప్పట్నుంచో బీజేపీ వ్యక్తిని. ఇవాళ నా కొడుకు అకిరాని పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడటం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది కానీ మాటలు రావట్లేదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసాక అకిరా నాకు కాల్ చేశాడు. మోదీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, అయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)