రేణు దేశాయ్ పాన్ ఇండియా చిత్రం ‘ఆద్య’

  • Published By: sekhar ,Published On : October 15, 2020 / 01:50 PM IST
రేణు దేశాయ్ పాన్ ఇండియా చిత్రం ‘ఆద్య’

Updated On : October 15, 2020 / 1:54 PM IST

Renu Desai: ఓ పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడుతున్నారు రేణు దేశాయ్. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రంతో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఆద్య’ అనే పేరు ఖరారు చేశారు. రేణు దేశాయ్ కుమార్తె పేరు కూడా ఆద్య నే కావడం విశేషం.


‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ్ కూరపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ‘ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెరకెక్కిస్తామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు.


ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి, కథ-మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యరెడ్డి.ఎస్, ప్రొడ్యూసర్స్: రావ్ డి.ఎస్-రజనీకాంత్.ఎస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల.