Roja Selvamani : మహేష్ బాబు పక్కన ఆ పాత్రలు చేయాలని ఉంది..
మహేశ్‌బాబుకి అభిమాని అయిన రోజా.. తన పక్కన అలాంటి పాత్రలు చేయాలని ఉందంటూ ఆమె కోరిక తెలియజేశారు.

Roja Selvamani want do that roles in Mahesh Babu Cinemas
Roja Selvamani : ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి ‘రోజా సెల్వమణి’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు. 2015 తరువాత సినిమాల్లో కనిపించని రోజా.. జబర్దస్త్ కామెడీ షోతో ఆడియన్స్ కి దగ్గర ఉన్నారు. అయితే మంత్రి పదవి చేపట్టిన తరువాత జబర్దస్త్ కి కూడా గుడ్ బై చెప్పేసి.. ప్రస్తుతం పొలిటికల్ గా బిజీ అయ్యారు. కాగా ఈమె తాజాగా మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
రోజాతో పాటు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారంతా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా కనిపిస్తూ వస్తున్నారు. రోజా మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే భవిషత్తులో మళ్ళీ నటిస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మాత్రం తనకి ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా రోజా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని అందరికి తెలిసిన విషయమే. మహేష్ బాబుతో ఎప్పుడు నటిస్తున్నారు అని ప్రశ్నించగా రోజా బదులిచ్చారు.
Also read : Emergency : ఇందిరా అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా.. ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ గ్లింప్స్..
“మహేశ్‌బాబుతో నటించాలనేది నాకున్న చాలా పెద్ద కోరిక. దాని కోసం ఎదురు చూస్తున్నాను. అయితే మహేష్ కి అమ్మ పాత్రలో కాకుండా అక్క, వదిన పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను” అంటూ రోజా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. కాగా మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత రాజమౌళితో SSMB29 తెరకెక్కించనున్నాడు. గుంటూరు కారం 2024 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది.