RRR : 24 ఏళ్ళ రజిని రికార్డుని బ్రేక్ చేసిన రాజమౌళి..

ఒకటిన్నర నెలలకు పైగా జపాన్‌ థియేటర్లలో ఉన్న 'RRR' ఎట్టకేలకు రజనీకాంత్ నటించిన 'ముత్తు' సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా జపాన్ లో అక్టోబర్ 21న విడుదలైంది. రిలీజ్ కు ముందే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హైప్ ని క్రియేట్ చేసుకోవడంతో..

RRR : 24 ఏళ్ళ రజిని రికార్డుని బ్రేక్ చేసిన రాజమౌళి..

RRR breaks 24years of rajinikanth record at japan box office

Updated On : December 13, 2022 / 12:13 PM IST

RRR : ఒకటిన్నర నెలలకు పైగా జపాన్‌ థియేటర్లలో ఉన్న ‘RRR’ ఎట్టకేలకు రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా జపాన్ లో అక్టోబర్ 21న విడుదలైంది. రిలీజ్ కు ముందే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హైప్ ని క్రియేట్ చేసుకోవడంతో.. జపనీస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

ఆర్ఆర్ఆర్ : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘RRR’..

ఇక విషయానికి వస్తే.. జపాన్‌ బాక్స్ ఆఫీస్ వద్ద 1998లో విడుదలైన రజినీకాంత్ ముత్తు చిత్రం 400 మిలియన్ యెన్‌లను సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మరే సినిమా దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లకపోవడంతో, గత 24 ఏళ్లగా ఆ రికార్డు అలానే ఉంది. తాజాగా ఈ రికార్డుని రాజమౌళి బ్రేక్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో 403 మిలియన్ యెన్‌ల కలెక్షన్లు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా RRR నిలవడంతో టాలీవుడ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు దాదాపు రూ.1144 కోట్లు కొల్లగొట్టింది. త్వరలో చైనాలో కూడా విడుదలకు సిద్దమవుతుంది. అక్కడ కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్స్ రాబడితే.. కెజిఎఫ్ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని (1230) దాటేస్తుంది.