సాహో – యూఎస్ టాక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో యూఎస్ టాక్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో యూఎస్ టాక్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలైంది. ఆగస్టు 29 రాత్రి నుండి యూఎస్‌లో భారీగా ప్రీమియర్స్ పడ్డాయి. ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాలు యూఎస్ ప్రేక్షకులను మెప్పించిన దాఖలాలు చాలా తక్కువ. బాహుబలి క్రేజ్ దృష్ట్యా ప్రభాస్ సాహోని అబ్రోడ్‌లో పెద్ద ఎత్తున విడుదల చేశారు.
అక్కడి ఆడియన్స్ టాక్ ఏంటంటే.. సాహో అవుటండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ చెప్తున్నారు. ప్రభాస్ ఇంట్రో, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ 30 నిమిషాలు, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్, టేకింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇటువంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదని..
Read Also : మీకు మాత్రమే చెప్తా – ఫస్ట్ లుక్..
డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా సాహో ఆకట్టుకుంటుందని యూఎస్ ప్రేక్షకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత అర్థరాత్రి కొన్నిచోట్ల షోలు వేశారు. తెలంగాణాలో ఈ ఉదయం నుండి సాహో సందడి స్టార్ట్ అయ్యింది. మరి కాసేపట్లో పూర్తి రివ్యూ రానుంది.