Sakala Gunabhi Rama: సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల
బిగ్‌బాస్ ఫేమ్ విజె సన్నీ, అషిమా హీరోహీరోయిన్‌గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ ఎస్‌కెఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్‌బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Sakala Gunabhi Rama Movie Releasing On September 16
Sakala Gunabhi Rama: బిగ్‌బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరోహీరోయిన్‌గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ ఎస్‌కెఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్‌బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నటుడు సోహైల్ మాట్లాడుతూ “మా బిగ్‌బాస్ సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. మేము బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్‌ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి” అని కోరుకున్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ వెలిగొండ మాట్లాడుతూ “చిన్న చిత్రాలు రిలీజ్‌కి చాలా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సకల గుణాభి రామ చిత్రాన్ని నిర్మించారు అలాగే ఆది నారాయణ గారు సెప్టెంబర్ 16న మంచి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. లాక్‌డౌన్ టైంలో చిన్న సినిమాగా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది” అని కోరుకున్నారు.
VJ Sunny : బిగ్‌బాస్ నాకేమి ఉపయోగపడలేదు.. మాజీ బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ
యాంకర్ రవి మాట్లాడుతూ “మేము బిగ్‌బాస్ టీం కాదు, మేము సినిమా వాళ్ళం, ఏదో ఒక శుక్రవారం మాది కావాలి అని కోరుకుంటాం, శుక్రవారం సెప్టెంబర్ 16న మా సన్నీది. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంటుంది, ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా గొప్పగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. సన్నీకి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు. బిగ్‌బాస్ జెస్సి మాట్లాడుతూ “మా అమ్మకి సన్నీ అంటే చాలా ఇష్టం. సన్నీ చాలా కష్టపడి ఈ సినిమా చేసాడు. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ అల్ ది బెస్ట్” అని తెలిపారు. నటుడు మానస్ మాట్లాడుతూ “ఈ చిత్రం నేను చూసాను, చాలా బాగా వచ్చింది చిత్రం. సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది.. అందరికీ నచ్చుతుంది. ఇది కంటెంట్ ఉన్న చిత్రం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి” అని తెలిపారు.
హీరోయిన్ ఆషిమా మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెలిగొండ గారికి నిర్మాత గారికి నా ధన్యవాదాలు. సన్నీతో నటించడం చాలా బాగుంది. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. అందరికీ నచ్చుతుంది” అని కోరుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ మాట్లాడుతూ “ఈ చిత్రం 100 థియేటర్స్‌లో సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది. డైరెక్టర్ శ్రీనివాస్ వెలిగొండ మంచి చిత్రాలకి రైటర్‌గా పని చేశారు. మంచి టాలెంట్ ఉంది తనకి. మా నిర్మాత మంచి ప్యాషనేట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సన్నీ నటన, హీరోయిన్ అసిమా నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయి” అని తెలిపారు.
VJ Sunny : షూటింగ్ స్పాట్ లో బిగ్‌బాస్ సన్నీపై దాడి.. పోలీసులకి ఫిర్యాదు..
హీరో సన్నీ మాట్లాడుతూ “నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన సోహైల్‌కి, జెస్సికి, మానస్‌కి, రవికి, హమీద అందరికీ నా కృతజ్ఞతలు. నేను బిగ్‌బాస్‌లో రాక ముందే నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. సోహైల్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. తనకు అద్భుతమైన టాలెంట్ ఉంది. తన చిత్రాలు మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. మానస్ నా ప్రాణ మిత్రుడు తన చిత్రాలు కూడా హిట్ కావాలి. మా చిత్రాన్ని 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్న ఆది నారాయణ గారికి నా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాము, ప్రేక్షకులు అందరూ మా సినిమాని చూసి హిట్ చేస్తారు” అని కోరుకున్నారు.