Samantha : నా జీవితం ఎలా ఉండాలో నేనే నిర్ణయిస్తా.. అభిమానికి సమంత రిప్లై..

శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన సమంత.. అభిమాని మరియు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు వైరల్ అవుతున్నాయి.

Samantha : నా జీవితం ఎలా ఉండాలో నేనే నిర్ణయిస్తా.. అభిమానికి సమంత రిప్లై..

Shaakuntalam promotions and samantha movie with Mrunal Thakur

Updated On : April 10, 2023 / 12:27 PM IST

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. విడాకులు, అనారోగ్యం వంటి సమస్యలతో మొన్నటి వరకు బ్యాడ్ టైంని ఫేస్ చేసింది. ఇటీవలే వాటన్నిటి నుంచి కోలుకొని మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది. ఈ క్రమంలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేసి, విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంది. అలాగే తను నటించిన శాకుంతలం (Shaakuntalam) రిలీజ్ కి సిద్దమవడడంతో ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించింది.

Samantha : రెండేళ్లలో చాలా జరిగాయి.. జీవిత పాఠాలు నేర్చుకున్నాను..

ఈ చిట్ చాట్ లో ఒక అభిమాని.. ‘మీరు అన్ని సమస్యలు ఎదురుకున్న తరువాత కూడా ఇంతటి బలాన్ని ఎక్కడి నుంచి సంపాదించారు. ఎలా ఇంత ధైర్యంగా ముందుకు వెళ్లడం మీకు సాధ్యం అవుతుంది’ అంటూ ప్రశ్నించింది. దీనికి సామ్ రిప్లై ఇస్తూ.. ”ఎందుకంటే నా కథ నేను అలా ముగిసిపోవాలి అనుకోలేదు. నా జీవితం ఎలా ఉండాలో నేనే నిర్ణయించుకుంటా” అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇక ఈ చిట్ చాట్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా జాయిన్ అయ్యింది. “నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్ పర్సన్ సామ్. శాకుంతలం సినిమా చూడడానికి నేను ఎదురు చూస్తున్నా. అలాగే మనం ఇద్దరు కలిసి ఎప్పుడు వర్క్ చేదాం” అంటూ ట్వీట్ చేసింది. దీనికి సమంత బదులిస్తూ.. ”ఐడియా బాగుంది. త్వరలో చేద్దాం” అంటూ రీ ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజెన్లు జెస్సి అండ్ సీతని ఒక ఫ్రేమ్ లో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.