Dunki : వెనక్కి తగ్గడం కాదు.. సలార్ కంటే ముందే డంకీ..

ప్రభాస్ ‘సలార్’తో షారుఖ్ ఖాన్ 'డంకీ' పోస్టుపోన్ అవుతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డంకీ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇస్తూ..

Dunki : వెనక్కి తగ్గడం కాదు.. సలార్ కంటే ముందే డంకీ..

Shah Rukh Khan Dunki movie releases before Prabhas Salaar

Updated On : October 21, 2023 / 8:26 PM IST

Dunki : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో షారుఖ్ ఖాన్ చేస్తున్న మూవీ ‘డంకీ’. ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే.. కేవలం బాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ ఓ రేంజ్ అంచనాలు నెలకుంటాయి. కాగా ఈ మూవీని ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా రిలీజ్ ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ప్రభాస్ ‘సలార్’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. డంకీ పోస్టుపోన్ అవుతుందంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

తాజాగా చిత్ర యూనిట్ ఈ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలియజేశారు. అంతేకాదు సలార్ కంటే ముందే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సలార్, డంకీ సినిమాలతో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమా స్టోరీ లైన్ కూడా రివీల్ చేశారు.

Also read : Sardar 2 : సర్దార్ 2 పై అప్డేట్ ఇచ్చిన కార్తీ.. వీడియో ట్వీట్ వైరల్..

ఒకరికి ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకునేందుకు ఒక సైనికుడు చేసిన ప్రయాణమే.. ఈ సినిమా కథ అని తెలియజేశారు. కాగా ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’కి ఫ్రీమేక్ గా వస్తుందని టాక్ వినిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలో హీరో.. తన ప్రియురాలు కోసం దొంగతనంగా అమెరికాకి బయలుదేరతాడు. ఇప్పుడు ఇదే కథలో కొన్ని చేంజస్ చేసి షారుఖ్ ఖాన్ డంకీ తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి.